Give Unconditional Access To Kulbhushan Jadhav: కులభూషణ్ జాదవ్‌కు బేషరతుగా ప్రవేశం కల్పించాలి : భారత్

Give Unconditional Access To Kulbhushan Jadhav: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు బేషరతుగా ప్రవేశం కల్పించాలని భారత్ పాకిస్థాన్‌ను కోరినట్లు వర్గాలు గురువారం ANI కి తెలిపాయి.

Update: 2020-07-16 09:49 GMT
Kulbhushan Jadhav

Give Unconditional Access To Kulbhushan Jadhav: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు బేషరతుగా ప్రవేశం కల్పించాలని భారత్ పాకిస్థాన్‌ను కోరినట్లు వర్గాలు గురువారం ANI కి తెలిపాయి. రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి జాదవ్ నిరాకరించారని పాకిస్తాన్ గతంలో పేర్కొంది. రివ్యూ పిటిషన్ ను దాఖలు చేయమని జాదవ్ ను కోరినట్లు భారత్ తెలిపింది. జాదవ్‌కు సంబంధించిన కేసులో అన్ని చట్టపరమైన ఎంపికలను అంచనా వేస్తున్నట్లు భారత్ గత గురువారం తెలిపింది.. భారత జాతీయుల ప్రాణాలను రక్షించడానికి కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

ఇక తన శిక్షకు వ్యతిరేకంగా ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) లో అప్పీల్ దాఖలు చేయడానికి జాదవ్ నిరాకరించారన్న పాకిస్తాన్ వాదనలను భారత్ తోసిపుచ్చింది.. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును అమలు చేయడానికి.. అలాగే తన హక్కులను వదులుకోవడానికి.. జాదవ్ పై ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొంది. కాగా గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఇరాన్ నుండి దేశంలోకి ప్రవేశించినట్లు ఆరోపణలతో జాదవ్‌ను మార్చి 3, 2016 న బలూచిస్తాన్ లో పాకిస్తాన్ భద్రతా దళాలు ఆయనను అరెస్టు చేశాయి. అయితే గూడచర్యం మరియు విధ్వంసక చర్యలలో జాదవ్ కు ప్రమేయం ఉందని పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ తిరస్కరించింది.. ఆయనను ఇరాన్ ఓడరేవు అయిన చాబహార్ నుండి కిడ్నాప్ చేయబడిందని పేర్కొంది. 

Tags:    

Similar News