INDIA Alliance Meeting: కాసేపట్లో ముంబైలో ఇండియా కూటమి సమావేశం.. హాజరుకానున్న సోనియా.. మమతా బెనర్జీ
INDIA Alliance Meeting: సమావేశాల్లో సంకీర్ణ లోగోను ఆవిష్కరించనున్న నేతలు
INDIA Alliance Meeting: ముంబై వేదికగా కాసేపట్లో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది.. మీటింగ్‌లో తీసుకోనున్న కీలక నిర్ణయాలు రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియా కూటమి అధికారిక లోగోను కూడా ఈ మీటింగ్‌లోనే విడుదల చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కూటమికి ఛైర్మన్, చీఫ్ కోఆర్డినేటర్‌లతో పాటు దాదాపు ఐదుగురు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించాలనే ప్రపోజల్ ఉందని తెలిపాయి.
రాష్ట్రాల స్థాయిలో సీట్ల సర్దుబాటు ఎలా జరగాలనే దానిపైనా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా 450 పార్లమెంటు స్థానాల్లో కూటమి తరఫున ఒకే అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నారు. ముంబైలో జరగబోయే మీటింగ్‌కు కాంగ్రెస్ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరుకానున్నారు.