India Alliance: ఇండియా కూటమి కీలక భేటీ.. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ, కూటమి బలోపేతంపై చర్చ

India Alliance: మమతా బెనర్జీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్న కాంగ్రెస్

Update: 2024-01-13 04:44 GMT

India Alliance: ఇండియా కూటమి కీలక భేటీ.. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ, కూటమి బలోపేతంపై చర్చ

India Alliance: ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నేతలు ఈరోజు సమావేశం కానున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ అంశం, కూటమి బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను చర్చించనున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ పాల్గొనడం లేదు. పలు కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉన్నారని కూటమి నేతలు అంటున్నారు. నితీశ్‌ కుమార్‌కు ఇండియా కూటమి కన్వినర్‌ బాధ్యతలివ్వాలంటూ జేడీయూ కోరుతుండగా, టీఎంసీ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తోంది. ఈ అంశంపైనా నేటి సమావేశంలో నేతలు చర్చించనున్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి 2 లోక్‌సభ స్థానాలు ఇవ్వడానికి మమతా బెనర్జీ సుముఖంగా ఉన్నారు. కాగా ఆమె ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరిస్తోంది. బెంగాల్‌లో 10 నుండి 12 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ కోరుతోంది. లెఫ్ట్ పార్టీలతో పొత్తుకు మమతా బెనర్జీ సుముఖంగా లేరు. ఇప్పటికే లెఫ్ట్ - టీఎంసీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Tags:    

Similar News