Delhi: ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ
Delhi: కేంద్ర దర్యాప్తు సంస్థలను... దుర్వినియోగం చేస్తున్నారంటూ విపక్షాల ఆరోపణలు
Delhi: ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగంతో పాటు ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలను నిరసిస్తూ ర్యాలీ ఏర్పాటు చేసింది కూటమి. సేవ్ డెమోక్రసీ అనే థీమ్‌తో కార్యక్రమం జరగనుంది. ఈ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు విపక్ష కూటమికి చెందిన 28 పార్టీల ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడుకోవడం కోసమే ఈ ర్యాలీ చేస్తున్నామని కూటమి నేతలు అంటున్నారు.