Delhi Pollution: ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం
Delhi Pollution: గాలి నాణ్యత పేలవంగా ఉందన్న సఫర్
Delhi Pollution: దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. సోమవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ రీసెర్చ్ పేర్కొంది. ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ 302గా నమోదైందని పేర్కొంది. రాబోయే రోజుల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని సఫర్ పేర్కొంది. 4వ తేదీ వరకు గాలి నాణ్యత తక్కువ స్థాయిలో ఉండి 5, 6 తేదీల్లో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించే అవకాశం ఉందని పేర్కొంది.