SBI: SBIలో పెరిగిన IMPS లిమిట్

SBI: అమల్లోకి వచ్చిన కొత్త ఛార్జీలు

Update: 2022-02-04 01:24 GMT

SBIలో పెరిగిన IMPS లిమిట్

SBI: భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఐఎంపీఎస్ నగదు బదిలీ పరిమితిని పెంచింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి 2 లక్షల పరిమితిని 5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఎస్‌బీఐ కస్టమర్లు ఐఎంపీఎస్ ద్వారా 5 ల‌క్షల వరకు న‌గ‌దు బ‌దిలీ చేసుకోవ‌చ్చు.

ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌ ద్వారా ఈ లావాదేవీలు నిర్వహించినప్పుడు ఎలాంటి రుసుములూ విధించ‌డం లేదు. అయితే బ్యాంకు శాఖ‌ల వ‌ద్ద నిర్వహించే రూ.2 ల‌క్షల వరకు లావాదేవీలకు పాత రేట్లే వ‌ర్తిస్తాయ‌ని బ్యాంకు తెలిపింది. 2 లక్షల నుంచి రూ.5 లక్షల ఐఎంపీఎస్‌ శ్లాబును బ్యాంకు శాఖల ద్వారా నిర్వహించినప్పుడు మాత్రం రూ.20 సేవా రుసుము వ‌ర్తిస్తుంద‌ని బ్యాంకు వెల్లడించింది.

Tags:    

Similar News