Income Tax Department: 2 లక్షల కంటే ఎక్కువైనా నగదు తీసుకోవచ్చు..

Income Tax Department: కోవిడ్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించింది.

Update: 2021-05-09 08:04 GMT

Income Tax Department: 2 లక్షల కంటే ఎక్కువైనా నగదు తీసుకోవచ్చు..

Income Tax Department: కోవిడ్ రోగులకు చికిత్స చేసే ఆసుపత్రులకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించింది. కోవిడ్ చికిత్సను అందించే ఆసుపత్రులు పేషెంట్ల నుంచి రూ.2 లక్షలకు మించి నగదును స్వీకరించవచ్చునని తెలిపింది. ఈ వెసులుబాటు మే 31 వరకు అమలవుతుందని ఆదాయపన్ను శాఖ వివరించింది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు ఈ విధంగా నగదు రూపంలో బిల్లులు తీసుకోవచ్చునని తెలిపింది. రోగికి, సొమ్ము చెల్లించేవారికి మధ్య గల సంబంధాన్ని కూడా నమోదు చేయాలని సూచించింది. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం, ఒక రోజులో రూ.2 లక్షల కన్నా ఎక్కువ నగదు లావాదేవీలు జరపడానికి అనుమతి లేదు. ఈ నిబంధనను తాత్కాలికంగా కోవిడ్ రోగుల చికిత్స కోసం సడలించారు.

Tags:    

Similar News