Sengol: కొత్త పార్లమెంట్ లో రాజదండం..దీని చారిత్రక విశేషాలు ఏంటంటే?

Sengol: కొత్త పార్లమెంట్ లో రాజదండం..దీని చారిత్రక విశేషాలు ఏంటంటే?

Update: 2023-05-26 02:11 GMT

Sengol: కొత్త పార్లమెంట్ లో రాజదండం..దీని చారిత్రక విశేషాలు ఏంటంటే?

Sengol: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఈ నెల 28న అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పీకర్ సీటు సమీపంలో చారిత్రాత్మకమైన రాజదండాన్ని ఆవిష్కరిస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. అమిత్ షా తాజా ప్రకటనతో రాజదండం దాన్ని ప్రాముఖ్యత గురించి అందరూ ఆరాలు తీస్తున్నారు.

బంగారు రాజదండం:

బ్రిటీషర్లు, భారతీయులు మధ్య జరిగిన అధికార బదిలీకి ఈ రాజదండం నిదర్శనం. బ్రిటీష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్...భారతదేశ తొలి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూకు తొలిసారిగా ఈ రాజదండం అందించారు.

అధికార మార్పిడికి సంకేతం

అధికార మార్పిడి సమయంలో మౌంట్ బాటెన్..నెహ్రూ మధ్య జరిగిన సంభాషణ రాజదండం తయారీకి నాంది పలికింది. అధికార బదిలీకి గుర్తుగా ఏం చేద్దామని మౌంట్ బాటెన్...నెహ్రూను ప్రశ్నించారు. దీంతో ఆయన రాజాజీ సలహా కోరారు. దీంతో ఆయన తమిళ సంప్రదాయాన్ని అనుసరిస్తూ రాజదండాన్ని తయారు చేద్దామని చెప్పడంతో నెహ్రూ అంగీకరించారు. అలా రాజదండం రూపకల్పనకు బీజం పడింది. ఈ రాజదండాన్ని అప్పట్లో మద్రాస్ లోని ఓ స్వర్ణకారుడితో తయారు చేయించారు. ఈ రాజదండం పొడవు ఐదు అడుగులు కాగా పై భాగంలో నంది విగ్రహం ఉంటుంది. ఈ రాజదందాన్ని న్యాయానికి ప్రతీకగా రూపొందించారు.

రాజదండాన్ని తయారు చేసిన తర్వాత తిరువడుత్తురై మఠానికి చెందని స్వామీజీ తొలుత మౌంట్ బాటెన్ కు అందించి తర్వాత వెనక్కి తీసుకున్నారు. అనంతరం గంగాజలంతో శుద్ధి చేసి నెహ్రూకి అందించారు. అలా రాజదండం సాక్షిగా అధికారమార్పిడి జరిగింది. ప్రస్తుతం ఈ రాజదండం అలహాబాద్ మ్యూజియంలో ఉంది. మర్చిపోయిన చరిత్రను గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న రాజదండం పై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Tags:    

Similar News