Baba Ramdev: బాబా సారీ చెప్తావా? లేదా వెయ్యి కోట్లు ఇస్తావా?
Baba Ramdev: రాందేవ్ బాబాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ డివిజన్ పరువు నష్టం నోటీసును పంపించింది.
Baba Ramdev: రాందేవ్ బాబాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ డివిజన్ పరువు నష్టం నోటీసును పంపించింది. కరోనాను నియంత్రించడంలో అల్లోపతి వైద్యం విఫలమైందంటూ పనికిమాలిన ఆరోపణలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాపై ఉత్తరాఖండ్ వైద్యుల బృందం రూ.1000కోట్లకు పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లోగా రాందేవ్ బాబా లిఖితపూర్వక క్షమాపణలు తెలియజేయాలని లేదంటే రూ.1000 కోట్లు చెల్లించాలని ఐఎంఏ ఉత్తరాఖండ్ డివిజన్ నోటీసులు పంపింది.
అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలపై రాందేవ్ బాబా క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేయకపోయినా.. 15 రోజుల్లో రాతపూర్వక క్షమాపణ చెప్పకపోయినా రాందేవ్ బాబా రూ.1000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని ఐఎంఏ పరువు నష్టం దావా ఫిర్యాదులో పేర్కొంది. రాందేవ్ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్‌కు కూడా ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ లేఖ రాసింది.