Bengal: నేను తిరిగి రాకపోతే పథకాలు అందవు: మమత
Bengal: బెంగాల్‌లో ఎన్నికల కమిషన్‌కు బదులుగా అమిత్‌షా కనుసన్నల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆక్షేపించారు.
Bengal: బెంగాల్‌లో ఎన్నికల కమిషన్‌కు బదులుగా అమిత్‌షా కనుసన్నల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆక్షేపించారు. నందిగ్రామ్ ఎన్నికల సంగ్రామం తర్వాత మమత ఈ విమర్శలు చేశారు. శుక్రవారం జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ అనేక మంది పార్టీ కార్యకర్తలను బీజేపీ పొట్టనపెట్టుకుందని చెప్పారామె. మా కార్యకర్తలను పలు చోట్ల చంపేశారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు మాత్రమే వేచి చూస్తాను. ఏ ఒక్కర్నీ వదలిపెట్టేది లేదని హెచ్చరించారు దీదీ.
నందిగ్రామ్‌లో 'నేను గెలుస్తానని నాకు తెలుసు నాతో పాటు ఇతర టీఎంసీ అభ్యర్థులు గెలవకపోతే ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తామని మమత ప్రశ్నించారు. నెంబర్ల బలం లేకుంటే.. 200 సీట్లు రాకుంటే.. ప్రభుత్వం ఎలా ఏర్పాటవుతుందని ప్రజల్ని ప్రశ్నించారు. నేను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే కన్యాశ్రీ, రూపాశ్రీ, ఉచిత రేషన్, ఉచిత సైకిళ్ల, రైతులకు ఉచిత భూములు ఉండవు' అని మమత హెచ్చరించారు. బెంగాల్‌లోని కేంద్ర బలగాలు బీజేపీతో కుమ్మక్కై అలజడులు సృష్టిస్తున్నాయని మమత ఆరోపించారు.