Passport: మీకు పాస్‌పోర్ట్ అత్యవసరమా.. అయితే ఈ ప్రక్రియ గురించి తెలుసుకోండి..!
Passport: మీకు పాస్‌పోర్ట్ అత్యవసరమా.. అయితే ఈ ప్రక్రియ గురించి తెలుసుకోండి..!
Passport: భారతదేశంలో డిజిటల్ విప్లవం వేగంగా పెరిగింది. దీనివల్ల అన్ని పనులు సులువుగా జరుగుతున్నాయి. ఆధార్ కార్డును అప్‌డేట్, ఐటీఆర్ ఫైల్ చేయడం వరకు అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా డిజిటల్ మాధ్యమం ద్వారానే పనులు చేయమని ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఈ పరిస్థితిలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలకు ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ రోజుల్లో పాస్‌పోర్ట్ దరఖాస్తు, తయారీ ప్రక్రియ చాలా సులభం. అది ఎలాగో తెలుసుకుందాం.
పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ
1. దీని కోసం ముందుగా మీరు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్ https://www.passportindia.gov.in/ పై క్లిక్ చేయండి.
2. తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
3. రిజిస్ట్రేషన్ కోసం మీకు ఒక ఫారమ్ ఇస్తారు. ఇందులో మీరు పేరు, ఈ మెయిల్ ఐడి, పుట్టిన తేదీ మొదలైన వివరాలను నింపాల్సి ఉంటుంది.
4. తర్వాత మీరు పాస్‌పోర్ట్ సేవా ఎంపికను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి.
5. తర్వాత ఫాం నింపే ఎంపికను చూస్తారు. దానిని ఎంచుకోండి.
6. ఫాం నింపిన తర్వాత సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
7. తర్వాత మీరు వ్యూ సేవ్ / సబ్మిటెడ్ అప్లికేషన్స్ ఎంపికపై క్లిక్ చేయండి.
8. తర్వాత మీరు పాస్‌పోర్ట్ కార్యాలయంలో అపాయింట్‌మెంట్ తేదీని ఎంచుకోమని అడుగుతుంది. దానిపై డేట్ ఎంటర్ చేయండి.
9. తర్వాత పే అండ్ బుక్ అపాయింట్‌మెంట్‌పై క్లిక్ చేసి, రసీదు ప్రింట్ అవుట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
10. ఇప్పుడు అపాయింట్‌మెంట్ రోజున పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లి అడిగిన వివరాలు అందించండి.
11. తరువాత పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియ 10 నుంచి 12 రోజుల్లో పూర్తవుతుంది.
12. తర్వాత ఇండియన్ పోస్ట్ మీ ఇంటి చిరునామాకు పాస్‌పోర్ట్ పంపుతుంది.
13. పాస్ పోర్ట్ కోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ బిల్లు, నీటి బిల్లు, విద్యుత్ బిల్లు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, 10వ తరగతి మార్క్‌షీట్ అవసరమవుతాయి.