Ration Card Rules: మీకు వివాహమైతే రేషన్ కార్డు త్వరగా అప్‌డేట్ చేయండి.. ఎందుకంటే..?
Ration Card Rules: మీరు రేషన్ కార్డ్ హోల్డర్ అయితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. రేషన్ కార్డులో అప్‌డేట్ గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి.
Ration Card Rules: మీరు రేషన్ కార్డ్ హోల్డర్ అయితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. రేషన్ కార్డులో అప్‌డేట్ గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి. రేషన్‌కార్డులో కుటుంబ సభ్యులందరి పేర్లు నమోదు చేస్తారు. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ కుటుంబంలోకి కొత్త సభ్యుడు వస్తే మీరు రేషన్ కార్డులో ఆ సభ్యుని పేరును నమోదు చేయవలసి ఉంటుంది. అలా చేయకుంటే మీకు సరిపడ సరుకులు అందవు. రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేరును చేర్చే పూర్తి ప్రక్రియను తెలుసుకుందాం.
రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేరు ఎలా చేర్చాలి..?
మీరు వివాహం చేసుకున్నట్లయితే ముందుగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలి. ఇందుకోసం మహిళా సభ్యుల ఆధార్ కార్డులో భర్త పేరు అప్‌డేట్ చేయాలి. ఒకవేళ పిల్లలు జన్మించినట్లయితే వారి పేర్లని యాడ్ చేయడానికి తండ్రి పేరు అవసరమవుతుంది. అలాగే అవసరమైతే చిరునామా కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డును అప్‌డేట్ చేసిన తర్వాత సవరించిన ఆధార్ కార్డు కాపీతో రేషన్ కార్డులో పేరు యాడ్ చేయమని ఆహార శాఖ అధికారికి దరఖాస్తు చేయాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..
ఇది కాకుండా మీరు ఇంట్లో కూర్చొని కొత్త సభ్యుల పేర్లను రేషన్ కార్డులో యాడ్ చేయడానికి అప్లై చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా మీ రాష్ట్ర ఆహార సరఫరా విభాగం అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆన్‌లైన్‌లో సభ్యుల పేర్లను యాడ్ చేసే సదుపాయం ఉంటే మీరు ఇంట్లో కూర్చొని ఈ పని చేయవచ్చు. వాస్తవానికి చాలా రాష్ట్రాలు తమ పోర్టల్‌లో ఈ సదుపాయాన్ని అందించాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ సదుపాయం లేదు. మీరు రేషన్‌కార్డులో పిల్లల పేరును యాడ్ చేయాలనుకుంటే ముందుగా వారికి ఆధార్ కార్డు తయారుచేయాలి. దీని కోసం మీకు పిల్లల జనన ధృవీకరణ పత్రం అవసరం. తరువాత మీరు ఆధార్ కార్డు సబ్ మిట్ చేసి రేషన్ కార్డులో పిల్లల పేరు నమోదు చేయడానికి దరఖాస్తు చేసుకోవాలి.
Also Read