Covaxin: కోవాగ్జిన్ కి డబుల్ మ్యూటెంట్లను ఢీకొనే సత్తా
Covaxin: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐసీఎంఆర్) ఇవాళ ఓ కీలక ప్రకటన చేసింది.
Covaxin: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐసీఎంఆర్) ఇవాళ ఓ కీలక ప్రకటన చేసింది. భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ టీకా అన్ని కరోనా వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పింది. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌పై కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని, సార్స్-కోవ్-2కు చెందిన వేర్వేరు రూపాలను నిర్వీర్యం చేస్తోందని తెలిపింది.
ఐసీఎంఆర్ ఇవాళ సోషల్ మీడియా వేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2 (సార్స్-కోవ్-2)కు చెందిన వివిధ రూపాలను కోవాగ్జిన్ ధ్వంసం చేసినట్లు ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను కూడా సమర్థవంతంగా నాశనం చేసినట్లు వెల్లడైంది. యూకే వేరియెంట్, బ్రెజిల్ వేరియెంట్‌లపై కోవాగ్జిన్ సామర్థ్యాన్ని ఐసీఎంఆర్-ఎన్ఐవీ వివరించాయి. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్ బి.1.617 సార్స్-కోవ్-2ను మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపాయి. ఇక, కోవాగ్జిన్ పనితీరుపై మధ్యంతర ఫలితాలు కూడా వెల్లడించింది భారత్ బయోటిక్. ఈ ఫలితాల్లో టీకా 78 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రకటించింది. సీరియస్ కేసుల్లో 100 శాతం సమర్థవంతంగా కోవాగ్జిన్ పనిచేస్తోందని వెల్లడించింది. త్వరలోనే కోవాగ్జిన్ తుది దశ ఫలితాలను ప్రకటించనున్నారు.