Corona Tests: కరోనా పరీక్షలు... కొత్తగా మార్గదర్శకాలు

Corona Tests: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కోవిడ్ -19 పరీక్ష కోసం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది

Update: 2021-05-05 04:30 GMT

Corona Tests:(File Image) 

Corona Tests: కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న సమయంలో కోవిడ్ టెస్టుల ఆలస్యంతో అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కోవిడ్ -19 పరీక్ష కోసం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. టెస్టింగ్ లేబ్ లలో పెరుగుతున్న ఒత్తిడి.. కారణంగా పరీక్షలను వేగంగా చేయడానికి అలాగే వేగంగా ఫలితాలను ఇవ్వడానికి గానూ ఈ మార్గాదర్శకాలు ఇచ్చింది. "ఆర్టీఏ లేదా ఆర్టీపీసీఆర్ ద్వారా ఒకసారి పాజిటివ్ పరీక్షించిన ఏ వ్యక్తిలోనైనా ఆర్టీపీసీఆర్ పరీక్ష పునరావృతం కాకూడదు" అని ఐసీఎంఆర్ ఆదేశించింది.

కోవిడ్ -19 కోలుకున్న రోగులకు ఆసుపత్రి డిశ్చార్జ్ సమయంలో ఎటువంటి పరీక్ష అవసరం లేదని చెప్పింది. అంతేకాకుండా, అంతర్-రాష్ట్ర దేశీయ ప్రయాణాన్ని చేపట్టే ఆరోగ్య వ్యక్తుల కోసం తప్పనిసరి నెగెటివ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష నివేదికల నిబంధనను తొలగించాలని ఐసీఎంఆర్ యోచిస్తోంది. అధికారిక నోటిఫికేషన్‌లో, ఐసీఎంఆర్ ఇలా చెప్పింది.."ప్రయోగశాలలపై భారాన్ని తగ్గించడానికి అంతర్-రాష్ట్ర దేశీయ ప్రయాణాన్ని చేపట్టే ఆరోగ్యకరమైన వ్యక్తులలో ఆర్టీపీసీఆర్ పరీక్ష అవసరం పూర్తిగా తొలగించాలి".

ఒకసారి నెగెటివ్ వచ్చిన తరువాత కూడా ఏమో ఇది తప్పేమో అనే ఆలోచనతో మరో దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడమూ కనిపిస్తోంది. దీంతో ల్యాబ్ ల ముందు క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ప్రయాణాలకు పరీక్షలు తప్పనిసరి కావడమూ ఇబ్బందికరంగా మారింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా తాము ప్రయాణించడం కోసం టెస్ట్ లు చేయించుకోవాలని వస్తున్నారు. దీంతో మరింత ఎక్కువ మంది ల్యాబ్ ల ముందు చేరుతున్నారు. ఈ పరిస్థితులు నివారించడానికి, ల్యాబ్ ల మీద ఒత్తిడి తగ్గించడానికి ఐసీఎంఆర్ కొన్ని కీలక సూచనలు చేసింది.

Tags:    

Similar News