పల్లెలతో పోలిస్తే పట్టణాల్లోనే కరోనా ముప్పు ఎక్కుగా ఉందని ఐసీఎంఆర్ తేల్చింది. పదేళ్లు దాటిన ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా ముప్పు ఉందని హెచ్చరించింది. ఓవైపు కరోనా అన్ లాక్ ప్రక్రియ వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరుగులు తీస్తుంటే, కరోనాపై నిర్లక్షం తగదని, రానున్న రోజుల్లో కరోనా విజృంబించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పల్లెలతో పోలిస్తే పట్టణాల్లోనే కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ నివేదిక జారి చేసింది. ఈ మధ్య చేసిన రెండో సీరో సర్వేలో ఈ విషయాన్ని తేల్చింది. కట్టడి లేని కరోనా నుంచి తప్పించుకునే క్రమంలో చాలా మంది గతంలో పల్లె బాట పట్టారు. దానికి ఆర్ధిక ఇబ్బందులు ప్రధాన కారణంగా నిలిచాయి. ఐతే అన్ లాక్ విధానం మొదలైన తరువాత ఆర్దికంగా పుంజుకునేందుకు మళ్ళీ పట్టణానికి తిరిగి వచ్చారు.
కరోనా వైరస్ అత్యదికంగా విజృంబిస్తున్న సమయంలోనే ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటు వైద్య నిపుణులు అంటున్నారు. సోషల్ డిస్టేన్స్ తో పాటు మాస్క్ లు ఉపయోగిస్తున్న వారి సంఖ్య విపరితంగా తగ్గినట్లు బైట స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల్లో కరోనా భయం వీడినా, వైరస్ ప్రభావం తగ్గ లేదంటున్నారు వైద్యులు. మరోవైపు పండగలు ప్రారంభం అవుతున్నాయి. సొంత ఊర్లకు ప్రయాణం అవుతున్న వారి సంఖ్య ప్రతి ఎడాది ఎక్కువగానే ఉంటుంది. అయితే అత్యవసరం అయితే తప్ప ఇప్పట్లో ప్రయాణాలు మానేయడం మంచిదంటున్నారు నిపుణులు.
రాబోయే నెలల్లో వరుస పండుగలు రాబోతున్నాయని, జనం ఎక్కడా ఎక్కువగా గుమికూడొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ సలహా ఇచ్చింది. కరోనా కట్టడికి కొత్త వ్యూహాలను అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఐతే మేతో పోలిస్తే ఆగస్టులో ఇన్ఫెక్షన్ రేటు తగ్గిందని ఐసీఎమ్ఆర్ తెలిపింది.