IAF Helicopter Crash: లైఫ్ సపోర్టుపై గ్రూప్ కెప్టెన్...
IAF Helicopter Crash: హెలికాప్టర్ ఘటనలో మొత్తం 14 మందిలో 13 మంది మృతి చెందగా.. కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో మిగిలారు.
IAF Helicopter Crash: హెలికాప్టర్ ఘటనలో మొత్తం 14 మందిలో 13 మంది మృతి చెందగా.. కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో మిగిలారు. ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాలతో వెల్లింగ్టన్ లోని మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
లైఫ్ సపోర్టుపై ఆయనకు చికత్స కొనసాగుతోందని తెలిపారు. అవసరమైతే ఆయన్ని బెంగళూరుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఈ ఏడాది స్వాంతంత్ర్య దినోత్సవం రోజున 'శౌర్య చక్ర' పురస్కారం అందుకున్నారు. 2020లో ఏరియల్ ఎమర్జెన్సీ తలెత్తినప్పుడు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఎల్ సీఏ తేజాస్ యుద్ధ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినందునకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది.