PM Modi: నేను ప్రధానిని కాను.. మీ సేవకుడిని..

PM Modi: దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఓ మెడికల్ కాలేజీ నిర్మించాలనేది తమ లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

Update: 2022-05-31 14:00 GMT

PM Modi: నేను ప్రధానిని కాను.. మీ సేవకుడిని..

PM Modi: దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఓ మెడికల్ కాలేజీ నిర్మించాలనేది తమ లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలో పేదరికం తగ్గుతుందని పలు అంతర్జాతీయ సంస్థలు చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. 8ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా శిమ్లాలో నిర్వహించిన గరీబ్ కళ్యాణ్ సమ్మేళనంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. అనంతరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నిధులు సుమారు 21వేల కోట్లను లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేశారు.

గత 8ఏళ్లలో ఒక్కసారి కూడా తనను తాను ప్రధానమంత్రగా ఊహించుకోలేదన్నారు మోడీ. తాను ప్రధానిని కాదని..130 కోట్ల మందికి ప్రధాన సేవకుడిని అని అన్నారు. దేశ సరిహద్దులు 2014 కంటే సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 200 కోట్ల కొవిడ్ టీకాలను పంపిణీ చేశామని ప్రధాని మోడీ తెలిపారు. 

Tags:    

Similar News