హైదరాబాద్ - ముంబై ప్రయాణం ఇక సులభతరం

Update: 2020-10-31 05:46 GMT

హైదరాబాద్ నుంచి ముంబైకి కొన్ని గంటల్లోనే వాలిపోవచ్చు ప్రయాణం బోరు కొట్టకముందే ముంబై రైల్వే స్టేషన్‌లో దిగిపోవచ్చు. అవును మీరు విన్నది నిజమే త్వరలో హైదరాబాద్ నుంచి ముంబై మధ్య బుల్లెట్ ట్రైయిన్ చక్కర్లు కొట్టనుంది. ఇక ముంబై ప్రయాణం మరింత సులభతరం కానుంది.

హైదరాబాద్‌–ముంబై మధ్య బుల్లెట్‌ రైలు కారిడార్‌ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ బిడ్లను కూడా ఆహ్వానించింది. నవంబర్ 5న ప్రీ బిడ్‌ సమావేశం జరుగనుంది. నవంబర్‌ 11-17 తేదీల్లో టెండర్‌ పత్రాలను స్వీకరించనున్నారు. ఇక నవంబర్ 18న డీపీఆర్‌ తయారీ సంస్థను ఎంపిక చేయనున్నారు.

దేశంలో హైస్పీడ్‌ రైళ్లను పట్టాలెక్కించాలని ప్రధాని నరేంద్రమోదీ సంకల్పించారు. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి ముంబైకి పుణే మీదుగా 711 కి.మీ. నిడివితో బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌ను నిర్మించేందుకు రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్లలో ప్రాజెక్టు పనులు ప్రారంభించే దిశగా కేంద్రం ఏర్పా ట్లు చేస్తోంది. ఇప్పటికే తొలి బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌ ముంబై– అహ్మదాబాద్‌ మధ్య సిద్ధమవుతోంది.

రష్యా కంపెనీకి చెందిన ఇంజనీర్లు హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ కారిడార్‌ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించారు. అది సాధ్యమే నని నివేదకలో స్పష్టం చేశారు. దీంతో వచ్చే ఐదేళ్లలో ఈ పనులు పూర్తవుతాయని రైల్వేశాఖ భావిస్తోంది.

Tags:    

Similar News