Union Minister for Human Resources Development : సిలబస్ తగ్గించే విషయంలో రాజకీయాలు చేయడం తగదు
Union Minister for Human Resources Development : సీబీఎస్ఈ సిలబస్ నుండి కొన్ని అంశాలను మినహాయిస్తున్నారని కొంత మంది తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారు.
Union Minister for Human Resources Development : సీబీఎస్ఈ సిలబస్ నుండి కొన్ని అంశాలను మినహాయిస్తున్నారని కొంత మంది తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ ఫోఖ్రీయావల్ అన్నారు. ఈ దేశంలో సంచలనం కోసం కొంతమంది ఇటువంటి అసత్యకథనాలను ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారాలను నమ్మవద్దంటూ ఆయన తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రత్యామ్నాయ విద్యా సంవత్సర క్యాలెండర్ తయారీ కోసం ఎన్సీఈఆర్టీ కి సూచించండం జరిగిందని తెలిపారు.
కరోనా కారణంగా కేవలం ఈ విద్యాసంవత్సరానికి పరీక్షల నుండి మినహాయింపు ఇచ్చామని స్పష్టం చేసారు. సిలబస్‌ను 30% తగ్గించడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం మాత్రమే లక్ష్యంగా చెప్పారు. వివిధ నిపుణుల సలహాలు.. సిఫారసులను అనుసరించి , విద్యావేత్తల నుండి వచ్చిన సలహాలను పరిశీలిస్తూ సిలబస్ తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సిలబస్ తగ్గించే విషయంలో రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు. విద్య అనేది మన పిల్లల పట్ల మన పవిత్రమైన కర్తవ్యం అని సూచించారు. రాజకీయాలను విద్య నుండి విడిచిపెట్టి, మన పిల్లలను విద్యావంతులుగా చేద్దాం అని పిలుపునిచ్చారు.