మీ బైక్ లేదా స్కూటర్‌ని ఎక్కడికైనా పార్సిల్ చేయవచ్చు.. అతి తక్కువ ధరలో..!
మీ బైక్ లేదా స్కూటర్‌ని ఎక్కడికైనా పార్సిల్ చేయవచ్చు.. అతి తక్కువ ధరలో..!
Indian Railways: ఉద్యోగం లేదా పై చదువుల కోసం చాలా సార్లు ప్రజలు ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో అవసరమైన వస్తువులతో పాటు బైక్‌లు లేదా స్కూటర్‌లను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దూరం మరీ ఎక్కువైతే ఏ రోడ్డు లేదా రైలు మార్గం గుండా పార్సిల్ చేయాల్సి ఉంటుంది. అయితే రోడ్డు మార్గం గుండా పార్సిల్ చేస్తే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అదే రైలు ద్వారా పార్సిల్ పంపితే తక్కువలో అయిపోతుంది. రైల్వే కొరియర్ సాయంతో వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా పంపవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
భారతీయ రైల్వేల నుంచి ఏదైనా వస్తువులను రవాణా చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి లగేజ్ రూపంలో రెండు పార్శిల్ రూపంలో. లగేజ్ అంటే మీరు ప్రయాణ సమయంలో మీ వెంట సామాను తీసుకెళ్తున్నారని అర్థం. పార్శిల్ అంటే మీరు మీకు నచ్చిన ప్రదేశానికి వస్తువులను పంపుతున్నారని అర్థం అంటే వాటితో మీరు ప్రయాణించలేరు.
బైక్‌ను పార్సిల్ చేయాలంటే ముందుగా సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడ పార్శిల్ కౌంటర్ నుంచి మొత్తం సమాచారం ఇస్తారు. తర్వాత అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి. పత్రాల ఒరిజినల్ కాపీ, ఫోటోకాపీ రెండింటినీ మీ వద్ద ఉంచుకోవాలి. ధృవీకరణ సమయంలో ఒరిజినల్ కాపీ అవసరం కావచ్చు. దీని తర్వాత మీ బైక్ ట్యాంక్ పార్సల్ చేయడానికి ముందు ఒక్కసారి తనిఖీ చేస్తారు.
రైల్వే ద్వారా వస్తువులను పంపడానికి ఛార్జీ బరువు, దూరాన్ని బట్టి లెక్కిస్తారు. రైలు ద్వారా బైక్‌లను రవాణా చేయడానికి చౌకైన, వేగవంతమైన మార్గం. పార్శిళ్లతో పోలిస్తే లగేజీ ఛార్జీలు ఎక్కువ. 500 కి.మీ దూరం వరకు బైక్‌ను రవాణా చేయడానికి సగటు ధర రూ.1200 అయితే ఇది కొద్దిగా మారవచ్చు. ఇది కాకుండా బైక్ ప్యాకింగ్‌కు సుమారు 300 నుంచి 500 చెల్లించాల్సి ఉంటుంది.