Ration Card: మీకు రేషన్‌ కార్డు ఉందా.. అయితే ఈ మార్పు గురించి గమనించండి..!

Ration Card: మీకు రేషన్‌కార్డు ఉందా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

Update: 2022-06-18 11:30 GMT

Ration Card: మీకు రేషన్‌ కార్డు ఉందా.. అయితే ఈ మార్పు గురించి గమనించండి..!

Ration Card: మీకు రేషన్‌కార్డు ఉందా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మీరు రేషన్‌కార్డులో మొబైల్‌ నెంబర్‌ ఆధార్‌తో లింక్‌ చేశారా లేదంటే వెంటనే చేయండి. అలాగే ఒకవేళ మీరు ఫోన్‌ నెంబర్‌ మార్చినట్లయితే రేషన్‌కార్డులో వెంటనే అప్‌డేట్‌ చేయండి. లేదంటే రేషన్‌ కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. మొబైల్‌ నెంబర్ మార్చే విధానాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఇంట్లో కూర్చొని కూడా ఈ పని చేయవచ్చు.

1. ముందుగా మీరు https://nfs.delhi.gov.in/Citizen/UpdateMobileNumber.aspx. ఈ సైట్‌కి వెళ్లండి

2. ఇక్కడ ఒక పేజీ ఓపెన్‌ అవుతుంది. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడాన్ని ఇక్కడ చూస్తారు.

3. ఇక్కడ అడిగిన సమాచారాన్ని అందించండి.

5. మొదటి కాలమ్‌లో ఇంటి అధినేత/NFS ID ఆధార్ సంఖ్యను ఎంటర్‌ చేయండి.

6. రెండో కాలమ్‌లో రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్‌ చేయండి.

7. మూడో కాలమ్‌లో ఇంటి అధినేత పేరు ఎంటర్‌ చేయండి.

8. చివరి కాలమ్‌లో మీ కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేసి దాన్ని సేవ్ చేయండి.

10. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది.

'వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్' పథకం

దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జూన్ 1, 2020 నుంచి ప్రభుత్వం రేషన్ కార్డ్ పోర్టబిలిటీ సర్వీస్ 'వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్'ని ప్రారంభించింది. అంటే మీరు యాప్ రేషన్ కార్డ్‌తో దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రేషన్ కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, గోవా, జార్ఖండ్, త్రిపుర, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, డామన్-డయ్యూలో అమలవుతోంది.

       Also Read

Ration Card Rules: మీకు వివాహమైతే రేషన్‌ కార్డు త్వరగా అప్‌డేట్‌ చేయండి.. ఎందుకంటే..?

రేషన్‌ కార్డుదారులకి గమనిక.. డీలర్ తక్కువ రేషన్‌ ఇస్తే ఈ నెంబర్లకి ఫోన్‌ చేసి కంప్లయింట్ ఇవ్వొచ్చు..!

Tags:    

Similar News