కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలకు సాధ్యమైనంత త్వరగా టీకాను అందుబాటులోకి తీసుకురావాలని భారత్‌లో తయారీసంస్ధలు, కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయ్. ఇలాంటి సమయలో వ్యాక్సిన్‌ను బీజేపీకి ఆపాదిస్తూ యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత్‌లో కరోనాపై పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న టీకాను తాను నమ్మబోనని ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపుతున్నాయ్. బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న ఈ టీకా నమ్మేలా లేదన్నారు. బీజేపీ నేతలను తాను నమ్మబోనని తాము అధికారంలోకి వస్తే ఉచిత వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని అఖిలేష్ చెప్పారు.