జమ్ముకశ్మీర్‌ ఎల్జీకి మరిన్ని అధికారాలు.. నిబంధనలు సవరించిన కేంద్రం

జమ్ముకశ్మీర్‌ ఎల్జీకి మరిన్ని అధికారాలు.. నిబంధనలు సవరించిన కేంద్రం

Update: 2024-07-13 13:00 GMT

జమ్ముకశ్మీర్‌ ఎల్జీకి మరిన్ని అధికారాలు.. నిబంధనలు సవరించిన కేంద్రం

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సవరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కల్పించింది. అంతర్గత భద్రత, బదిలీలు, ప్రాసిక్యూషన్, అటార్నీ జనరల్‌, ప్రభుత్వ న్యాయవాదుల నియామకంతో సహా కీలకమైన విషయాల్లో ఎల్జీదే పెత్తనం కానున్నది. చట్టం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ విచక్షణాధికారాన్ని అమలు చేయడానికి పోలీస్‌, పబ్లిక్ ఆర్డర్, ఏఐఎస్‌, ఏసీబీ, ఆర్థిక శాఖకు సంబంధించి అవసరమయ్యే ఏ ప్రతిపాదననూ చీఫ్ సెక్రటరీ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ ముందు ఉంచితే తప్ప ఆమోదం లేదా తిరస్కారం పొందదు అని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News