Amit Shah meets LK Advani for Babri Masjid Demolition Case: మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత, ఎల్‌కే అద్వానీతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ ఏయే అంశాలపై చర్చించారనేదానిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కాగా జూలై 24, శుక్రవారం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ వాగ్మూలం నమోదు చేయనున్న నేపథ్యంలో అద్వానీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవడం విశేషం.
ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6 న కొంతమంది వ్యక్తులు పడగొట్టారు, రామజన్మభూమిలో ఈ మసీదు ఉందని ఆ సమయంలో ఈ మసీదును కూల్చేశారు. దీంతో ఈ కేసులో బీజేపీ సీనియర్ నాయకులు అద్వానీ, మహిళా నాయకురాలు ఉమా భారతి, మురళి మనోహర్ జోషి ఈ కేసులో నేరపూరిత కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవాళ జోషి వాంగ్మూలం నమోదు చేయనున్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ తొమ్మిది నెలల్లోపు పూర్తి కావాలని, అంటే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, మే 8 న , ట్రయల్ కోర్టు తన తీర్పును ఆగస్టు 31 వరకు ప్రకటించడానికి గడువును పొడిగించింది. Masjid