Home Isolation New Rules: హోం ఐసోలేషన్ నూతన గైడ్‌లైన్స్ ప్రకటించిన కేంద్రం
Home Isolation New Rules: దేశంలో కరోనా సెంకడ్ వేవ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
Home Isolation New Rules: దేశంలో కరోనా సెంకడ్ వేవ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉన్నవారి కోసం కేంద్రం నూతన గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది.
కొత్త గైడ్‌లైన్స్ మేరకు.. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు తప్పనిసరిగా మూడు లేయర్ల మెడికల్ మాస్క్‌ను వినియోగించాలని ప్రకటించింది. అలాగే వీరి వద్దకు కుటుంబ సభ్యులు వస్తే.. అంతా ఎన్95 మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. 1 శాతం సోడియం హైపోక్లోరైట్‌తో క్రిమిసంహారకం చేసిన తర్వాత మాత్రమే మాస్క్ లను తొలగించాలని కోరింది. కరోనా బారిన పడిన వారు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.
కాగా, దేశ వ్యాప్తంగా ఒకే రోజు 3,79,257 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరుకుంది. అలాగే యాక్టీవ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు సమాచారం.