పాటలీపుత్ర యుద్ధంలో అంతిమ విజేత ఎవరు?
దేశంలోని మిగిలిన రాష్ట్రాలు వేరు... బీహార్ వేరు. ఇక్కడనీ తేడా లెక్కలే. ఊహకు అందని అంచనాలే. ప్రతీ ఐదేళ్లకోసారి మారే సమీకరణలు.. రాజకీయ వైకుంఠపాళిలో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నిలబెట్టాలో తెలిసిన రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి.
యుద్ధం మొదలైంది. అస్త్రం పదునెక్కతోంది. మాటలు తూటాల్లా పేలుతున్నాయి. వ్యూహాలు సీను మార్చుకుంటున్నాయి. పావులు వేగంగా కదులుతున్నాయి. సమీకరణలు మారుతున్నాయి. పాటలీపుత్ర పీఠాన్ని అధిష్టించేందుకు రాజకీయాలు అంతకంతకూ రాటుదేలుతున్నాయి. ఎవరిని ఎవరు ఎలా ఆకట్టుకోవాలో... దాని మంత్రాలను అలవోకగా వల్లెవేస్తూ వశీకరణ విద్యకు ప్రాణం పోస్తున్నారు. తంత్రాలు ప్రయోగిస్తున్న నేతలను, సర్వేల చేయిస్తున్న పార్టీలను బీహారీలు అంతే ఆసక్తిగా గమనిస్తున్నారు. తమ ఓట్లను ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తూ నిబ్బరంగా కనిపిస్తున్నారు. ఇంతకీ మారుతున్న వ్యూహాలు, వేస్తున్న ఎత్తులు ఎవరికి లాభం.. ఎవరికి నష్టం. మొత్తంగా పాటలీపుత్ర యుద్ధంలో అంతిమ విజేత ఎవరు? ఇదే ఇవాళ్టి స్పెషల్‌ఫోకస్.
దేశంలోని మిగిలిన రాష్ట్రాలు వేరు... బీహార్ వేరు. ఇక్కడనీ తేడా లెక్కలే. ఊహకు అందని అంచనాలే. ప్రతీ ఐదేళ్లకోసారి మారే సమీకరణలు.. రాజకీయ వైకుంఠపాళిలో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నిలబెట్టాలో తెలిసిన రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి. అభివృద్ధి మంత్రం ఎంతగా పఠించినా.... ప్రగతిని ఎంత వేగంగా పరుగులు పెట్టించినా... అంతిమ తీర్పీ సామాజిక సమీకరణలదే. ఆ ఈక్వేషన్సే సొంత నియోజకవర్గాల్లో సోదరులకు గట్టి పోటీ ఇస్తోంది.
సంపూర్ణ విప్లవాన్ని తెచ్చినా .. మావోయిస్ట్, కమ్యూనిస్ట్ సెంటర్ ఏర్పడినా.. భూమిహారుల కార్యకలాపాలు పెట్రేగినా.. వాటన్నింటి వేదిక బీహారే. అలాగే ఎంతోమంది కరుడు కట్టిన నేరగాళ్ళకు అడ్డా కూడా. అలాంటి బీహార్‌లో పాలనా పగ్గాలు చేపట్టాలంటే మాటలు కాదు. దానికి ఎన్నో లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్లో పాస్ అయితే పగ్గాలు సునాయాసంగా చేపట్టొచ్చు. కానీ అదే ఈసారి అందరికీ అగ్నిపరీక్ష పెడుతోంది. ఇంతకీ పాసయ్యేది ఎవరు? ఫెయిల్యూర్ లిస్టులో చేరేది ఎవరు?
నాలుగు వరుస బహిరంగ సభల్లో విపక్ష నేతలపై వాడి విమర్శలతో దండెత్తారు. పశ్చిమ చెంపారన్ జిల్లాలోని బగహలో రెండో దశ ఎన్నికల ప్రచార చివరి సభలో ప్రసంగిస్తూ.. దేశవ్యాప్తంగా నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ప్రచార సభల్లో మాదిరిగానే ఆదివారం నాటి ప్రచారంలోనూ ఆర్జేడీ నేత, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ లక్ష్యంగా ప్రధాని విమర్శలు గుప్పించారు.