hmtv CFW Awards: కరోనా మహమ్మరిని చూసి దేశం మొత్తం వణికిపోతున్న వేళ.. ప్రజలందరూ బిక్కుబిక్కున ఇళ్లకే పరిమితమైన వేళ.. ఈ రోగాన్ని చూసి జనం జంకుతుంటే.. తామున్నామంటు భరోసా కల్పిస్తూ..అంకితభావంతో ప్రజలకు అండగా నిలిచారు కరోనా వారియర్స్. కరోనా వైరస్‌ను యోధులుగా ఎదుర్కొన్నారు వారు. ప్రజాసేవలో నిమగ్నమై.. ఎనలేని సేవలు చేసి కీర్తి గడించారు వారు. కరోనా నియంత్రణలో వారిసేవలు మరువలేనివి. అలాంటి వారి సేవలను hmtv గుర్తించాలనుకుంటుంది. ఈ మేరకు కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్ కి hmtv పురస్కారాలు అందించి, తమ వంతుగా వారి సేవలను ప్రపంచానికి చాటలని ఎదురుచూస్తోంది.
మరణమృదంగం మోగిస్తున్న కరోనా రక్కసిని అడ్డుకోవడానికి అహోరాత్రులు ఎంతో మంది శ్రమించారు. మృత్యువుకు ఎదురొడ్డి రోగులకు సేవలందించారు వైద్యులు, ఇతర సిబ్బంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి వీధులన్నీ శుభ్రం చేశారు సఫాయిలు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు ఆహారాన్ని అందించి ప్రాణాలు నిలిపారు సమాజ సేవకులు. ఇలాంటి వారందరికి hmtv తరపున వందనాలు అందిస్తోంది. ఇలాంటి వారి వివరాలను 9553586190 కు కాల్ చేసి అందించండి. అలాగే ఈ పురస్కారాలకు సంబంధించి మరిన్ని వివరాలను https://www.hmtvlive.com/cfwawards లింక్ లో పరిశీలించగలరు.