Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో కీలక తీర్పు.. మసీదు ప్రాంగణంలో పూజలకు అనుమతి
Gyanvapi Case: హిందువుల అతిపెద్ద విజయంగా పేర్కొన్న కాశీవిశ్వనాథ్ ట్రస్ట్
Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది వారణాసి కోర్టు. పూజలను వారం రోజుల్లో ప్రారంభిస్తామని కోర్టుకు తెలియజేసింది కాశీవిశ్వనాథ ట్రస్ట్. ఇది దేశంలోని హిందువులకు అతిపెద్ద విజయం అని కాశీవిశ్వనాథ ట్రస్ట్ పేర్కొంది. ఇకపై మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేయనున్నారు హిందువులు.
ఈ మసీదు హిందూ దేవాలయంపై కట్టారని..ఇప్పటికే అందులో దేవాలయం ఆనవాళ్లు ఉన్నాయని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు.. మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేత శాస్త్రీయ పరిశోధన ఆదేశించింది. దీంతో సర్వే చేపట్టిన ASI మసీదును దేశాలయంపైనే కట్టారని.. దీనికి తగు ఆనవాళ్లు లభ్యమైనట్లు వారు చేసిన సర్వే లో తెలిపారు. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.