మనుషులతో చిరుత ఆటలు

Update: 2021-01-15 09:10 GMT

మామూలుగా చిరుతను దగ్గరని నుంచి చూస్తే గుండే హడలిపోతుంది. కానీ అది మనుషులతో ఎంతో సరదాగా మెలుగుతుందన్న విషయం తెలిస్తే అశ్చర్యపోతారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓ చిరుత మనుషులతో ఆటలాడింది. పెంపుడు జంతువుగా రెండు కాళ్లు పైకెత్తి చిలిపిగా వ్యవహరించింది. దీంతో చుట్టు ఉన్న జనం కాస్త కంగారు పడ్డా చిరుతను అంత దగ్గర నుంచి చూసి ఎంజయ్‌ చేశారు. చివరికి ఆ చిరుత ఎవరిపైనా దాడి చేయకుండా వెళ్లిపోయింది. ఏదేమైనా తమ జీవితాల్లో ఒక సాహస సన్నివేశం జరిగిందని వారు అంటున్నారు. వన్యమృగాలకు, మనుషులకు మధ్య సామరస్యత ఉంటుందని ఈ సంఘటన రుజువు చేసిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Full View


Tags:    

Similar News