Karnataka: కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్‌

Karnataka: మూడ్రోజుల పాటు విద్యాసంస్థల మూసివేత

Update: 2022-02-08 12:00 GMT

Karnataka: మూడ్రోజుల పాటు విద్యాసంస్థల మూసివేత

Karnataka: హిజాబ్‌ వివాదం కర్ణాటకను కుదిపేస్తోంది. పలు కళాశాలల వద్ద హిజాబ్‌ అనుకూల, వ్యతిరేక వర్గాల నినాదాలు, ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బాగల్‌కోటలోని కళాశాలలో విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ప్రతిగా విద్యార్థులు రాళ్లదాడికి దిగారు. మరోవైపు హిజాబ్‌ వివాదం హైకోర్టుకు చేరింది. ప్రభుత్వం, పిటిషనర్ల తరఫున వాదలను విన్న హైకోర్టు ధర్మాసనం... విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మూడురోజుల పాటు పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశించారు.

కర్ణాటకలో హిజాబ్‌ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఉడిపి జిల్లాకే పరిమితమైన ఈ వివాదంపై ఇప్పుడు రాష్ట్రమంతటా కళాశాల్లో ఇరు వర్గాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో పలు కళాశాలల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తాజాగా బాగల్‌కోట్‌ కళాశాలలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో పోలీసులపై విద్యార్థులు రాళ్లదాడికి దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పలు కళాశాలల్లో 144 సెక్షన్ విధించారు.

ఇక ఉడిపిలోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ కళాశాలలో ఇరువర్గాల విద్యార్థులు భారీగా తరలివచ్చారు. కాషాయ కండువాలను ధరించిన విద్యార్థులు హిజాబ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు హిజాబ్‌ అనుమతించాలని విద్యార్థినులు డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు కాషాయ కండువాలు, తలపాలను ఏబీవీపీ పంపిణీ చేసింది. ఈ విషయమై సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. విద్యార్థులు ఆందోళనలు చేయరాదని బొమ్మై పిలుపునిచ్చారు. కోర్టు తీర్పు తరువాత ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.

Tags:    

Similar News