Coronavirus: కరోనా మహా' కల్లోలం
Coronavirus: 24 గంటల్లో 40 వేలకు చేరువగా కేసులు * మహారాష్ట్రలోనే 25,681
Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి తీవ్రరూపం దాలుస్తోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 24 గంటల్లో దాదాపు 39,726 కొత్త కేసులు బయటపడగా ఇందులో 64 శాతం (25,681) కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 24.22 లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా శుక్రవారం 24 గంటల్లో 154 మంది కొవిడ్ బాధితులు చనిపోగా.. 70 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయి.
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రైవేటు కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగుల హాజరును 50 శాతానికే పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలిచ్చింది. లేదంటే లాక్‌డౌన్ విధించక తప్పని పరిస్థితులు ఎదురవుతాయన్నారు.
* పంజాబ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నందున మార్చి 31 వరకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు మినహా అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు.
* పుదుచ్చేరిలోనూ మార్చి 22 నుంచి మే 31 వరకు 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
మహరాష్ట్రలో కరోనా తీవ్రరూపం దాల్చింది. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రె కరోనా వ్యాప్తి అరికట్టడానికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గంగా భావిస్తున్నారు.. మహారాష్ట్ర లో ప్రతిరోజు గరిష్టంగా 25,833 కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాప్తి సెకండ్‌వేవ్‌లోకి ప్రవేశించిందని, దీన్ని అరికట్టాలంటే ప్రజలంతా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అన్నారు. మాస్క్ లు ధరించడం, సామాజికదూరం పాటించడం, సానిటైజేష్‌ను తప్పకుండా అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు.
గతంలో కోవిడ్ విజృంబించినప్పుడు ప్రజలందరు సహకరించారని, ఇప్పుడు కూడా అలాగే సహకరించి ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలని అన్నారు. ప్రజలందరు. విధిగా వ్యాక్సినేషన్‌ను చేసుకొవాలని సీఎం ఉద్దవ్‌ఠాక్రె కోరారు. దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని అన్నారు. వ్యాక్సిన్‌ల కోరత లేకుండా, ప్రజలందరికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.