Corona Updates: ఆ ఆరు రాష్ట్రాల నుండే 86.25 శాతం కరోనా కేసులు
Corona Updates: కరోనా కేసుల్లో 86.25 శాతం ఆరు రాష్ట్రాల నుంచే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Corona Updates: దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు నుంచే ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 18,599 కేసులు రావడం.. వైరస్ తీవ్రతను తెలియజేస్తుంది. మహారాష్ట్రలో తాజాగా 11,141 మందికి వైరస్ సోకడం ఆ రాష్ట్రంలో మహమ్మారి విజృంభణకు నిదర్శనం. రాష్ట్ర అసెంబ్లీలో 36 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఔరంగాబాద్‌లో పాక్షికంగా లాక్‌డౌన్ అమలు చేసే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దేవ్, రెవెన్యూ మంత్రి జైసింగ్ అగర్వాల్‌కు కరోనా సోకినట్లు తేలింది.
కోలుకున్నవారే అధికం.
దేశంలో గడిచిన 24 గంటల్లో 7,48,525 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..15,388 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజు(18,599)తో పోల్చితే రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపించింది. అలాగే నిన్న ఈ మహమ్మారికి 77 మంది మృత్యువాతపడ్డారు. అయితే, మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. మొత్తంగా 1.12 కోట్ల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడగా..1,57,930 మంది ప్రాణాలు వదిలారని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1,87,462 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.67కి తగ్గింది. 24 గంటల్లో 16,596 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. నిన్న కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉండటం గమనార్హం. ఇప్పటివరకు 1,08,99,394 మంది వైరస్‌ను జయించగా..ఆ రేటు 96.93 శాతంగా ఉంది.
Telangana Corona Cases:
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 32,189 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 142 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,00,153కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1644కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 178 మంది కోలుకున్నారు.