High Court pulls up Delhi government: ఢిల్లీ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం.!
High Court pulls up Delhi government: ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నిర్దారణ లో భాగంగా ప్రజలకు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించడాన్నిహైకోర్టు తప్పుపట్టింది.
High Court pulls up Delhi government: ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నిర్దారణ లో భాగంగా ప్రజలకు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించడాన్నిహైకోర్టు తప్పుపట్టింది. రాపిడ్ యాంటిజెన్ టెస్టుల ద్వారా తప్పుడు ఫలితాలు వస్తున్నాయని మండిపడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శక సూత్రాలను ఎందుకు పాటించటం లేదని ప్రశ్నించింది. రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్ సూచించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సొంత ప్రయోగాలకు పోకూడదని తేల్చి చేప్పింది. కేవలం లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఆర్టీ,పీసీ ఆర్ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్ సూచించిదని తెలిపింది. ఎలాంటి లక్షణాలు లేని 22.86 శాతం మంది రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించుకున్నారని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిర్వహించిన 'సీరో సర్వే' లో తేలిందని కోర్ట్ పేర్కొంది. ఈ రకంగా టెస్టింగ్ చేయాలని ఐ సీ ఎం ఆర్ సూచించిందా అని బెంజ్ ప్రశ్నించారు. అలాగే కోవిడ్ టెస్టింగ్ చేయించుకోగోరేవారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై కూడా కోర్టు మండిపడింది.
ఢిల్లీ జైళ్లలో కరోనా కల్లోలం:
ఢిల్లీ జైళ్లలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు ఢిల్లీ జైళ్లలోని సిబ్బంది, ఖైదీలు కలిపి మొత్తం 221 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 161 మంది సిబ్బంది, 60 మంది ఖైదీలు ఉన్నారు.అయితే, ఆ 60 మంది ఖైదీలలో 55 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా బారిన పడి ఇద్దరు ఖైదీలు మరణించారు. రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఓ ఖైదీ జైలు నుంచి విడుదలై హోంక్వారెంటైన్‌లో ఉన్నాడు. ఇక కరోనా మహమ్మారి బారినపడ్డ 161 మంది జైలు సిబ్బందిలో 122 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మరో 39 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అంటే ఖైదీలు సిబ్బంది కలిపి ఢిల్లీ జైళ్లలో మొత్తం 41 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీ జైళ్ల అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. తాజాగా ఈరోజు ఢిల్లీలో 613 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఢిల్లీలో మొత్తం 1,31,219 కరోనా కేసులు నమోదయ్యాని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో 10,994 మంది వివిధ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల పరంగా ఢిల్లీ 10వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.