Delhi: ఢిల్లీకి హై అలర్ట్ ప్రకటించిన భద్రతా బలగాలు
* ఉగ్రదాడి జరగొచ్చంటూ నిఘావర్గాల హెచ్చరిక * భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు హెచ్చరికలు
Delhi: దేశరాజథాని ఢిల్లీకి హై అలర్ట్ ప్రకటించింది ఇంటిలిజెన్స్. స్వాతంత్ర్య దినోత్సవం ముందు ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నారంటూ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్‌కు సంబంధించిన ఉగ్ర సంస్థలు డ్రోన్లతో భారీ కుట్ర చేస్తున్నట్లు తెలిపింది. ఆర్టికల్ 370 తొలగించిన ఆగస్టు 5నే ఈ దాడులకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఢిల్లీ పోలీసులను హెచ్చరించాయి నిఘా వర్గాలు. ఇప్పటికే జమ్ములో పలుచోట్ల డ్రోన్లతో దాడులు దాడులకు ప్రయత్నాలు జరగడంతో అదే తరహాలో ఢిల్లీలో అటాక్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపాయి. ఇక డ్రోన్ల దాడి జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో డ్రోన్ల సంచారంపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తోంది ఢిల్లీ పోలీస్ శాఖ. ఎర్రకోట దగ్గర భద్రత కోసం.. నాలుగు యాంటీ డ్రోన్ సిస్టమ్‌లను కూడా ఇన్‌స్టాల్ చేయించింది. దీంతో డ్రోన్ జిహాద్ ముప్పును తిప్పికొట్టేందుకు ఢిల్లీ పోలీసులతో పాటు ఇతర భద్రతా బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జమ్మూలోని ఎయిర్ స్టేషన్ పై ఇటీవల జరిగిన డ్రోన్ దాడి దృష్ట్యా ఢిల్లీ పోలీసులతో పాటు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలంటూ ఉన్నతాధికారులు సూచించారు.