షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు: పోలీసుల దర్యాప్తు

షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. రూ. 50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని ఆయనను బెదిరించారు.దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2024-11-07 09:32 GMT

షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు: పోలీసుల దర్యాప్తు

షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. రూ. 50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని ఆయనను బెదిరించారు.దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద బందోబస్తును పెంచారు. ఇటీవలనే సల్మాన్ ఖాన్ ను కూడా చంపుతామని బెదిరించారు. షారూక్ ఖాన్ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్లు 308 (4), 351(3) (4) కింద కేసు నమోదు చేశారు.

రాయ్ పూర్ నుంచి ఫోన్

షారుఖ్ ఖాన్ కు వచ్చిన ఫోన్ కాల్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ నుంచి వచ్చిందని ముంబై పోలీసులు గుర్తించారు. ముంబై పోలీసులు రాయ్ పూర్ కు టీమ్ వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఫోన్ ను చేసింది ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 12న మాజీ మంత్రి బాబా సిద్దిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హతమార్చింది. సల్మాన్ ఖాన్ కు సన్నిహితంగా ఉన్నందునే హతమార్చినట్టు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.సల్మాన్ ఖాన్ ను చంపుతామని గ్యాంగ్ బెదిరించింది.

వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ను బెదిరించిన కేసులో ఓ కూరగాయల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు.అక్టోబర్ 24న అతడిని అరెస్ట్ చేశారు. రెండోసారి బెదిరింపులకు పాల్పడిన కేసులో వారం రోజుల క్రితం మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News