Republic Day 2022 Highlights: ఈసారి రిపబ్లిక్‌ డేలో కొన్ని ప్రత్యేకతలు

Republic Day 2022 Highlights: 73వ గణతంత్ర దినోత్సవ సంబరాలు దేశ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి.

Update: 2022-01-26 08:56 GMT

Republic Day 2022 Highlights: ఈసారి రిపబ్లిక్‌ డేలో కొన్ని ప్రత్యేకతలు

Republic Day 2022 Highlights: 73వ గణతంత్ర దినోత్సవ సంబరాలు దేశ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. దేశప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ముందుగా నేషనల్‌ వార్‌ మెమోరియల్ జ్యోతి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం గౌరవ వందనం సమర్పించారు.

73వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రారంభించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఈసారి రిపబ్లిక్‌ డే ఉత్సవాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో ఈసారి ఎన్‌సీసీ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళి పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఈ గణతంత్ర వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 480 మంది డాన్సర్లు తమ ప్రదర్శన ఇచ్చారు. ఈ వేడుకల్లో కేవలం డబుల్‌ డోస్‌ టీకా తీసుకున్న వారిని మాత్రమే అనుమతించారు. 15 ఏళ్ల లోపు చిన్నారులకు, సింగిల్‌ డోస్‌ తీసుకున్నవారికి అనుమతి నిరాకరించారు.

ఈ సారి సంప్రదాయానికి విరుద్ధంగా 10.30 నిమిషాలకు గణతంత్ర వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీలోని నెలకొన్న వాతావరణమే అందుకు కారణం. పొగమంచు 11 గంటల వరకు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ జెండా వందనంతో ఈసారి వేడుకలు ప్రారంభమయ్యాయి ఇందులో పరమవీర చక్ర, అశోకచక్ర అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. పరేడ్‌లో ఆరు కవాతు బృందాలు, 96 మంది యువ నావికులు, నావికా దళానికి చెందిన నలుగురు అధికారులు, వైమానిక దళానికి చెందిన 96 మంది ఎయిర్‌మెన్లు, నలుగురు అధికారలు పాల్గొన్నారు.

గణతంత్ర వేడుకల్లో భాగంగానే జనవరి 29న విజయ్‌ చౌక్‌లో జరిగే బీటింగ్‌ రీట్రీట్‌ వేడుక కోసం దేశీయంగా తయారుచేసిన వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. 

Tags:    

Similar News