ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న సహాయకచర్యలు
* మంచు చరియలు విరిగిపడి పోటెత్తిన ధౌలి నది * 31కి చేరుకున్న మృతుల సంఖ్య * ఉత్తరాఖండ్‌లో సాయం ముమ్మరం
ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరుకున్నాయి. ధౌలి గంగ పోటెత్తి ఒక పవర్ ప్రాజెక్ట్‌ని ముంచెత్తింది. అందులో పని చేస్తున్న కార్మికులు గల్లంతయ్యారు. చమోలి జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది.
చమోలో జిల్లాలో పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఏరియల్ సర్వే చేశారు. జోషిమఠ్‌లోని ఐటీబీపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం రావత్ పరామర్శించారు. సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడిన 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరలోనే వారు కోలుకుంటున్నాట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనలో అదృశ్యం అయిన మరో 175 మంది ఆచూకీ లభించలేదు. మరోవైపు భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మరో సొరంగంలో చిక్కుకున్న 35 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల తొలగింపు జరుగుతోందని ఉన్నతాధికారలు తెలిపారు.