హెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
New Helmet Rules: మీకు ద్విచక్రవాహనం ఉందా? హెల్మెట్‌ను ధరించడం లేదా? అయితే మీరు అప్రమత్తమవ్వకపోతే మీ జేబుకు చిల్లు పడుతుంది.
New Helmet Rules: మీకు ద్విచక్రవాహనం ఉందా? హెల్మెట్‌ను ధరించడం లేదా? అయితే మీరు అప్రమత్తమవ్వకపోతే మీ జేబుకు చిల్లు పడుతుంది. హెల్మెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేయబోతోంది. తేడాలొస్తే జరినమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌మీదా వేటు తప్పదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. హెల్మెట్ విషయమై మోటార్ వెహికిల్స్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించనున్నది. ఇక మీదట హెల్మెట్ నాణ్యతా ప్రమాణాలు లేకున్నా ఫైన్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్- BIS సర్టిఫికేషన్, ఐఎస్‌ఐ మార్క్ హెల్మెట్లనే వాడాల్సి ఉంటుంది. అలా లేకుంటే మోటర్ వెహికిల్స్ యాక్ట్ 1988లోని సెక్షన్ 129ని ఉల్లఘింనట్టే. సెక్షన్-194డీ ప్రకారం వెయ్యి రూపాయల ఫైన్‌తో పాటు మూడు నెలలపాటు లైసెన్స్‌ను సస్సెండ్ అవుతుంది.
ద్విచక్రవాహనదారులు హెల్మెట్లను తప్పనిసరి ధరించాలని 2021 జూన్1న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నాన్-ఐఎస్‌ఐ హెల్మెట్‌లను కేంద్రం బ్యాన్ చేసినా ఇప్పటికీ చాలామంది వాటినే ఉపయోగిస్తున్నారు. ఇక బైక్ రైడింగ్‌లో వెనుక కూర్చున్నవారికి కూడా హెల్మెట్ తప్పనిసరి. అంతేకాదు వారి హెల్మెట్ కూడా నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందే. బైక్‌పై వెళ్తున్న సమయంలో హెల్మెట్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. ఒకవేళ హెల్మెట్ ఐఎస్‌ఐ మార్క్, బీఎస్‌ఐ సర్టిఫికేషన్ లేకపోయినా వెయ్యి రూపాయల ఫైన్ కట్టాల్సిందే. సిగ్నల్ జంపింగ్‌కు 2 వేల రూపాయల జరిమానా తప్పదుని కొత్త సవరణలు చెబుతున్నాయి.