Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Weather Report: ఏపీకి 3రోజులు, తెలంగాణకు 2రోజులు వర్ష సూచన

Update: 2022-10-07 03:01 GMT

Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఏపీ వ్యాప్తంగా రెండు రోజులు, తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక.. హైదరాబాద్‌లో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఉపరితల ఆవర్తనం ఏపీలోని కోస్తా తీరంతో పాటు ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్‌, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్య భాగాలలో సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అక్టోబర్‌ 9 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ.. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలోని వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడ్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో.. వాతావరణ కేంద్రం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.

ఏపీపై అల్పపీడనం ప్రభాంతో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

Tags:    

Similar News