Heavy Rains in Mumbai: ముంబయి నగరంలో భారీ వర్షాలు

Heavy Rains in Mumbai: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ముంబయి నగరం అతలాకుతలం అవుతుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయి మరో సముద్రాన్ని తలసిస్తున్నాయి

Update: 2020-08-04 06:42 GMT
mumbai

Heavy Rains in Mumbai: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ముంబయి నగరం అతలాకుతలం అవుతుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయి మరో సముద్రాన్ని తలసిస్తున్నాయి. వరద నీరు పూర్తిగా రోడ్లపై చేరడంతో జనజీవనం, రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించి పోవడంతో ముంబయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజులు పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ముంబై, దాని శివారు ప్రాంతాల్లో వర్షాలు తీవ్రమవుతాయని ఐఎండీ అంచనా వేస్తుంది. సముద్రంలో తీరంలో మంగళవారం మధ్యాహ్నం 12:47 గంటలకు 4.51 మీటర్ల ఎత్తైన ఆటుపోట్లు వస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా, సోమవారం నుండి ముంబైలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారీ వర్షం కారణంగా అనేక సేవలకు అంతరాయం కలుగుతుంది.

ఇక పోతే గత 10 గంటల్లో ముంబైలో 230 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ముంబై మున్సిపల్‌కార్పొరేషన్ వెల్లడి చేసింది. ఐఎండీ ఇచ్చిన హెచ్చరికలతో ముంబై ప్రభుత్వం అత్యవసర సేవలు మినహా మిగిలిన కార్యాలయాలన్నింటికి సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప రెండు రోజుల పాటు ఎవరు ఇళ్లు దాటి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ముంబాయితో పాటు థానే, ఉత్తర కొంకణ్ ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

పలు చోట్ల జాతీయ రహదారులపై కొండచరియలు విరిగిపడి ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. ఇక నగరంలో వర్ష ప్రభావంతో నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. ముంబాయి ట్రాఫిక్ పోలీసు విభాగం సమాచారం ప్రకారం, JJ వంతెన యొక్క ఉత్తర చివర సమీపంలో ఉన్న సోఫియా జుబెర్ జంక్షన్, పైడోనీ వద్ద జెజె జంక్షన్, కుర్లా వద్ద సింహం తోట, ఎల్బిఎస్ రోడ్, బైకుల్లా సమీపంలో సర్దార్ హోటల్ జంక్షన్, మహాలక్ష్మి ఆలయం, సంత్ సవతా జంక్షన్, మజ్గావ్, కుర్లా స్టేషన్, సంఖాలి వీధి, నాగ్‌పాడ, నాయర్ ఆసుపత్రి సమీపంలో, అదే విధంగా డాక్‌యార్డ్ స్టేషన్ లలో భారీ ఎత్తున వర్షం నీరు చేరుకుందని తెలిపారు. 

Tags:    

Similar News