అసోంలో భారీ వరదలు, నీటి మునిగిన పలు ప్రాంతాలు
*వరదల్లో మునిగిన లోతట్టు ప్రాంతాలు, 57వేల మంది నిరాశ్రయులు
Assam: భారీ వర్షాలు, వరదలతో అసోం అతలాకుతలమౌతుంది. వరదల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పంటపొలాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరదల కారణంగా ఇప్పటికే 57వేల మంది నిరాశ్రయులైనట్లు తెలుస్తుంది. అటు పట్టాలపై వరద ఉధృతి పెరగడంతో పలు రైల్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.