Monsoon: ఒకరోజు ముందే మహారాష్ట్రలోకి నైరుతి రుతుపవనాలు

Monsoon: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Update: 2021-06-09 08:01 GMT

Monsoon: ఒకరోజు ముందే మహారాష్ట్రలోకి నైరుతి రుతుపవనాలు

Monsoon: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్రకు రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా జూన్‌ 10న నైరుతి ప్రవేశించాల్సి ఉండగా ఈ ఏడాది ఒకరోజు ముందే మహారాష్ట్రను తాకగా మంగళవారం సాయంత్రం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరవాసులకు తిప్పలు తప్పటం లేదు. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవగా ఫుట్‌పాత్‌లు కూడా మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు రావడంతో వాహనాల రాకపోకలు, ప్రజా జీవనానికి అంతరాయం కలుగుతోంది.

ఇక ముంబైతో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో రుతుపవనాల ప్రభావం ఉండగా ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలుగురాష్ట్రాల్లో కూడా రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News