Uttar Pradesh Floods : భారీ వరదలతో అతలాకుతలం అవుతున్న యూపీ

* ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగ, యమునా నదులు * దీంతో లోతట్టు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు

Update: 2021-08-08 12:51 GMT

యూపీ భారీ వరదలు (ఫైల్ ఇమేజ్)

Uttar Pradesh Floods: ఉత్తరప్రదేశ్‌లో భారీ వరదలకు గంగ, యమునా నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదుల నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గంగా నీటిమట్టం ఫమౌలో 84.03 మీటర్లు, ఛట్నాగ్‌లో 83.30 మీటర్లకు చేరింది. నైనీ దగ్గర యమునా నది నీటిమట్టం 83.88 మీటర్లకు పెరిగింది.

మరోవైపు వరదలతో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. గంగా నీటిమట్టం ఇప్పటికే 70.26 మీటర్ల హెచ్చరిక స్థాయిని దాటిందని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ గంగా డివిజన్‌ తెలిపింది. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వరదల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

Tags:    

Similar News