Floods: హిమాచల్ ప్రదేశ్‌లో వరదల బీభత్సం

Floods: కుల్లు ప్రాంతంలో వరదలకు కొట్టుకుపోయిన గుడారాలు * గుడారాల్లోని పది మంది గల్లంతు

Update: 2021-07-28 07:55 GMT

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు (ఫైల్ ఇమేజ్)

Floods: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుల్లు ఏరియాలో వరదలతో 10మంది గల్లంతయ్యారు.లాహౌల్ గిరిజన జిల్లాలో ఉదయపూర్ ప్రాంతంలో వరదలకు రెండు గూడారాలు కొట్టుకుపోయాయి. ఈ దుర్ఘటనలో గూడారాల్లో ఉన్న 10 మంది కూలీలు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారి కోసం హిమాచల్ ప్రదేశ్ పోలీసులు, ఐటీబీపీ బృందాలు గాలిస్తున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షపాతం కారణంగా భాగా నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. కిన్నౌరులో కొండచరియలు విరిగిపడటంతో 60 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. బస్తరీ సమీపంలో యాత్రికులున్న టెంపోపై బండరాళ్లు పడటంతో 9 మంది పర్యాటకులు మరణించారు.

Tags:    

Similar News