ఇవాళ సూరత్‌ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ విచారణ

* రాహుల్ కించపర్చేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పిటిషన్

Update: 2023-04-13 04:30 GMT

ఇవాళ సూరత్‌ కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ విచారణ

Rahul Gandhi: ఇవాళ సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ కేసు విచారణకు రానుంది. మెజిస్ట్రేట్ కోర్టు విధించిన శిక్షపై.. స్టే విధించాలని రాహుల్ తరఫు లాయర్లు కోరనున్నారు. మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. కిందికోర్టు తీర్పు సవాల్ చేస్తూ రాహుల్ పిటిషన్ వేశారు. 2019లో కోలార్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంటి పేరు ఉన్నవాళ్లంతా దొంగలుగా ఉన్నారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. కోలార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో మొత్తం మోడీ వర్గాన్ని కించపరిచారని సూరత్ కోర్టులో ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పిటిషన్ వేశారు.

Tags:    

Similar News