Hathras Stampede: యూపీ తొక్కిసలాట ఘటనపై సిట్ నివేదిక
Hathras Stampede: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో తొక్కిసలాట ఘటనపై యూపీ ప్రభుత్వానికి నివేదికను ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించింది.
Hathras Stampede: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో తొక్కిసలాట ఘటనపై యూపీ ప్రభుత్వానికి నివేదికను ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించింది. తొక్కిసలాటకు నిర్వాహకులదే బాధ్యత అని, స్థానిక యంత్రాంగం సైతం ఉదాసీనంగా వ్యవహరించిందని సిట్ పేర్కొంది. వాస్తవాలను దాచిపెట్టి నిర్వాహకులు సత్సంగ్ కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నారని నివేదికలో పేర్కొంది. షరతులు పాటించలేదని ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలను ఆహ్వానించి వారికి కనీస ఏర్పాట్లు చేయలేదన్నారు. పోలీసు వెరిఫికేషన్ లేకుండానే వాలంటీర్లను నియమించుకున్నారని తెలిపింది. ప్రమాదం జరగ్గానే నిర్వాహకుల కమిటీలోని సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు అని సిట్ తన నివేదికలో వెల్లడించింది. అటు స్థానిక పోలీసులు, యంత్రాంగం కూడా ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదని సిట్ తెలిపింది.
హత్రాస్ తొక్కిసలాట ఘటనలో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. పిటిషన్‌ను విచారణ కోసం సోమవారం లిస్ట్ చేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ నెల 2న హత్రాస్‌లో భోలే బాబా నిర్వహించిన సత్సంగంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఘటనపై నివేదిక తయారు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.