Manohar Lal Khattar: హరియాణా సీఎం ఖట్టర్ రాజీనామా
Manohar Lal Khattar: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఖట్టర్
Manohar Lal Khattar: హర్యానాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ, జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలతో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. గవర్నర్‌కు తన రాజీనామా లేఖ అందజేశారు. ఖట్టర్‌ను లోక్‌సభ బరిలోకి దింపే అవకాశం ఉండటంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.
కొద్దిరోజులుగా జేజేపీ, బీజేపీ కూటమిలో విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ సీట్ల పంపకాల్లోనూ రెండు పార్టీల మద్య సయోధ్య కుదరలేదు. నిన్న నడ్డాతో జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా చేసిన చర్చలు కూడా విఫలం కావడంతో.. హర్యానాలో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేందుకు దుష్యంత్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది బీజేపీ. కాసేపట్లో హర్యానా బీజేఎల్‌పీ సమావేశం కానుండగా.. మధ్యాహ్నం హర్యానా కొత్త సీఎం ప్రమాణస్వీకారం కూడా చేసే అవకాశాలున్నాయి.