Harish Rawat: కాంగ్రెస్‌కు షాక్.. పరిస్థితి విషమిస్తే.. రాజకీయ సన్యాసానికైనా సిద్ధమని సంకేతం?
Harish Rawat: కాంగ్రెస్ నాయకత్వంపై మరో సీనియర్ నేత తిరుగుబాటు బావుటా ఎగరేశారు.
Harish Rawat: కాంగ్రెస్ నాయకత్వంపై మరో సీనియర్ నేత తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ పార్టీలో పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ బాహాటంగా ట్వీట్లు చేయడం కాక రేపుతోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు మంత్రాలను రచించ వలసిన వేళ హైకమాండ్ అర్ధం లేని డైరక్షన్ తో తన కాళ్లు , చేతులు కట్టేసినట్లవుతోందని వ్యాఖ్యానించారు. నడిసముద్రంలో కాళ్లు, చేతులు కట్టి పడేస్తే ఎలా ఎన్నికల సాగరాన్ని ఈదుతామని ఆయన ప్రశ్నించారు.
పార్టీ పరిస్థితులపై తాను విసిగిపోయానంటున్న హరీష్ రావత్ కొత్త ఏడాదైనా కేదార్ నాథ్ స్వామి తనకు ఒక డైరక్షన్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గా ఉన్న రావత్ తనను తక్షణం ఆ బాధ్యత నుంచి తప్పించాలని ఉత్తరాఖండ్ ఎన్నికల సమరానికి సిద్ధపడే అవకాశ మివ్వాలని కోరుతున్నారు. మరీ పరిస్థితులు విషమిస్తే రాజకీయ సన్యాసానికైనా సిద్ధమంటున్నారాయన.