కరోనా ముప్పుతో మారిన ఆహార అలవాట్లు

కోవిడ్-19 మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు జరిగాయి.

Update: 2021-02-04 12:37 GMT

కరోనా ముప్పుతో మారిన ఆహార అలవాట్లు

కోవిడ్-19 మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు జరిగాయి. పనితీరు, పరిశుభ్రత నుంచి ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఆరోగ్యంపై, ఆహారంపై శ్రద్ధ పెరిగింది. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుకున్నారు. ఇలాంటి ఆరోగ్య జాగ్రత్తల వల్ల కరోనా నుంచే కాదు ప్రజలు చాలా విష జ్వరాల నుంచి తమను తాము కాపాడుతున్నారు.

కరోనాతో ప్రజల జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆహార అలవాట్లనూ మార్చుకున్నారు. రుచి కోసం కాకుండా రోగనిరోధకశక్తిని పెంపొందించే ఆహారానికే మొగ్గు చూపుతున్నారు. ఇలా ప్రజలు తీసుకున్న జాగ్రత్తలు సీజనల్‌ వ్యాధుల కేసులను తగ్గించాయి. ప్రతి ఏడాది సీజనల్‌ వ్యాధులు, విష జ్వరాలు వస్తు ఉంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం సీజనల్ వ్యాధులు చాలా తక్కువగా నమోదు అయ్యాయని డాక్టర్స్ అంటున్నారు. సాధారణంగా ఈపాటికే...ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ సీజనల్ వ్యాధులతో నిండిపోవాలి... కానీ ఈ ఏడాది మాత్రం ఎక్కువగా కేసులు నమోదు కాలేదు.

కరోనా కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించడంతో వల్ల విష జ్వరాలు ప్రబలలేదని వైద్యులు అంటున్నారు. చలికాలం వచ్చినదంటే... చిన్న పిల్లలతో పాటు పెద్ద వారికి కూడా విష జ్వరాలు వేదిస్తుంటాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా నార్మల్ వ్యాధులు తగ్గాయని వైద్యులు అంటున్నారు. మొత్తంగా కరోనా వైరస్‌ విజృంభనతో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Tags:    

Similar News