Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదు వివాదంపై నేడు కీలక తీర్పు
Gyanvapi Masjid Case: ఇప్పటికే పూర్తయిన వాదనలు, వారణాసిలో 144 సెక్షన్, కట్టుదిట్టమైన భద్రతా
Gyanvapi Masjid Case: ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు ఇవాళ కీలక తీర్పును ఇవ్వనున్నది. మసీదు కాంప్లెక్స్‌లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వారణాసిలో హైఅలర్ట్ ప్రకటించారు. కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద భద్రతను భారీగా పెంచారు. ఈ పిటిషన్ అభ్యంతరాలపై ఇప్పటికే వాదనలు విన్న జిల్లా న్యాయమూర్తి.. ఆగష్టు 24వ తేదీనే తీర్పును సిద్ధం చేసి వాయిదా వేశారు. అయితే.. ఇవాళ ఆ తీర్పును ప్రకటించనున్నారు.
మసీదు కాంప్లెక్స్‌లోని తటాకంలో శివలింగాకారం బయటపడిందని, హిందూ నేపథ్యం ఉన్న కారణంగా అక్కడ పూజలకు అనుమతించాలంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది. అయితే.. అది శివలింగం కాదంటూ మసీద్ కమిటీ వాదిస్తోంది. ఒకవేళ తీర్పు గనుక వ్యతిరేకంగా వస్తే అలహాబాద్ హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్తామని పిటిషనర్లు చెప్తున్నారు.